Share News

AP Elections 2024: విశాఖలో జరిగిన ఘటనపై విచారించాలి.. ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ

ABN , Publish Date - May 20 , 2024 | 03:33 PM

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు.

AP Elections 2024: విశాఖలో జరిగిన ఘటనపై విచారించాలి.. ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ
Kinjarapu Atchannaidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలోని కంచరపాలెంలో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే తమపై దాడి జరిగిందని బాధితులు చెబుతున్నారని అన్నారు.బాధితులు చెప్పిన విషయాన్నే మీడియా కూడా ప్రచురించిందని చెప్పారు. ఈ ఘటనపై విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని.. కానీ పోలీసులు మాత్రం వైసీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల గళం వినిపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి సిబ్బందితో పాటు విష్ణుకుమార్ రాజుపైనా కేసులు నమోదు చేశారన్నారు.


దాడి ఘటనను మీడియా ద్వారా రిపోర్ట్ చేయడమే నేరమన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పేలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖలో ఎన్నికల అనంతరం హింసను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి కూడా పంపినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 03:38 PM