Home » Andhra Pradesh » Krishna
సామాన్యుల ఆస్తులకే కాదు దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండాపోతోంది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన సుమారు ఎకరం భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు పావులు కదుపుతున్నారు. దీని విలువ సుమారు రూ.5 కోట్ల పైచిలుకు ఉంటుంది.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు అపహాస్యంగా మారింది. పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎన్నికల యంత్రాంగం సరైన ప్రచారం కల్పించకపోవటం ఒక సమస్య అయితే, కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రచారం ద్వారా మాత్రమే చాలామంది పట్టభద్రులు ఆలస్యంగా ఓటుహక్కు నమోదు విషయాన్ని తెలుసుకోవడం మరో సమస్య. అయితే, అప్పటికే సమయం మించిపోయింది.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో పాలన గాడితప్పింది. ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరిస్తూ ఖర్చుల పేరుతో ప్రతి పనికీ రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, ఇతరత్రా పత్రాల మంజూరులో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓ అధికారి.. దరఖాస్తుల్లోని నెంబర్లకు ఫోన్చేసి నేరుగా బేరాలకు దిగుతుండటం, రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ బేరాల ప్రక్రియ ప్రారంభంకావడం ఇక్కడికొస్తున్న ప్రజలకు షరామామూలే.
రానున్న సంక్రాంతి లోపు గోతులు లేని రహదారుల నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా అన్నారు.
గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన శిష్ట్లాను శనివారం ఓ హోటల్లో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
గాలులు, వర్షాలకు మొ వ్వ, కారకంపాడు, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో కోతలకు సిద్ధమైన వరి పొలాలు నేలకొరిగాయి.
మచిలీపట్నం-విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు గాయపడ్డారు.
జగ్గయ్యపేటలో నాగలక్ష్మి అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు.
గ్రామాల్లో కుక్కలు, కోతులు స్వైర విహా రం చేస్తున్నాయి.
Andhrapradesh: నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ‘‘మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం. నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరుతున్నాను’’ అని లోకేష్ అన్నారు.