Home » Andhra Pradesh » Prakasam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలు ప్రారంభించి పూర్తిచేసిన పక్కా గృహాల్లో ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 3వతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్ష ఇళ్లల్లో ప్రవేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నో ఏళ్ళుగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వంద మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 40 మందికి కంటి ఆపరే షన్లు అవసరమని నిర్ధారించారు.
విద్యుత్తు చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు ఆందోళన చేయటం దొంగే దొంగ అని రాద్ధాంతం చేసినట్లుగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్యజమెత్తారు. శనివారం ఆమె నరసరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో 13 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై పెనుబారం మోపారని విమర్శించారు.
ముప్పవరం-బెంగుళూరు హైవేరోడ్డు నిర్మాణం కోసం వెలుగువారిపాలెం సమీపానగల సర్వేనంబర్ 489 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారని గ్రామ స్థులు పేర్కొన్నారు. గ్రావెల్‌ను అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. ఈమేరకు శనివారం వెలుగు వారిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీ ల్దార్ కె.సంజీవరావుకు వినతిపత్రం అందజేశారు.
మండల పరిధిలోని వీర్ల కొండ గ్రానైట్ క్వారీల సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుండి బైకుపై వస్తున్న కార్మికులు శనివారం రాత్రి ఇరువురు డీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ముఠా మేస్త్రీ వెంకటేష్ (40) అక్కడిక్కడే మృతి చెందగా ఎస్కలేటర్ అపరేటర్ వివేకానందరెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. బల్లికురవ సంతమాగులూరు రోడ్డు వీర్ల కొండ క్వారీల సమీపంలో ముడి రాయి రవాణా చేసే ఒక లారీ మర్మత్తులకు గురై నిలిచి పోయింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వేతో గ్రామాలలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు దగ్గరుండి తమ భూములను సర్వే చేయించుకోవాలని చీరాల అర్డీవో చంద్రశేఖరనాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుంటుపల్లిలో టీ డీపీ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మెట్టమెదటి సారిగా చేపడుతున్న భూ సర్వేపై రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గ్రానైట్ క్వారీలలో పనులు నిలిపి వేసి ఉన్న ప్రదేశాలలో ఉన్న నీటితో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిబంధనల మేరకు పనులు చేయాల్సిన వారు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో క్వారీలను నిలుపుదల చేశారు. తవ్వకాలు చేసిన గుంటలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచి ఉంది.
జిల్లాలో మూడు రోజులపాటు కురిసిన వర్షాలు శుక్రవారం తెరపి ఇచ్చాయి. దీంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ వర్షాల వల్ల లక్ష ఎకరాల్లోని పంట పొలాల్లో నీరు చేరింది. ప్రధానంగా పొగాకు, శనగ, మినుము నీటిలోనే ఉన్నాయి. కోత కోసిన వరి ఓదెలు, కల్లాల్లోని మిరపకాయలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో నీటిని తొలగించి నష్టాన్ని తగ్గించుకొనే ప్రయత్నాలను రైతులు చేస్తున్నారు.
తమ పాలనలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత విపక్ష వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజాస్పందన పెద్దగా కనిపించడం లేదు. అందుకు విద్యుత్ చార్జీల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాలు దర్పణం పట్టాయి.
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక ప్రకాశం భవన్లో శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.