Home » Andhra Pradesh » Prakasam
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక ప్రకాశం భవన్లో శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మార్కాపురం పట్టణంలో అనధికారిక వెంచర్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు రోజులుగా వాటి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. వాటిని అందుకున్న వారు వారంరోజుల్లో అక్రమ వెంచర్లను తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు.
నల్లమల అటవీ పరిధిలోని అర్ధవీడు మండలం మొహిద్దీన్పురం గ్రామ పరిసరాలలో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి 11గంటలకు కంభం నుంచి అర్థవీడుకు నాగూర్వలి, మరో ఇద్దరు కారులో వెళ్తుండగా మొహిద్దీన్పురం-నాగులవరం గ్రామాల మధ్య రోడ్డు వెంట వారికి చిరుతపులి కనిపించింది.
భూసమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులే స్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి వైసీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. స్థానిక ఎస్సీవీకే నిలయం (రీడింగ్ రూమ్)లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Andhrapradesh: ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని జగన్పై మంత్రి వీరాంజనేయస్వామి మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య. ఏపీఈఆర్సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
దేశంలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేసి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)దేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య చెప్పారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు గురువారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రెండు శతాబ్దాల క్రితం నాటి చరిత్రకు అద్దంకి ప్రాంతంలోని ఓ సరిహద్దు రాయి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుతం అద్దంకి, బల్లికురవ మండలాల సరిహద్దులో నామ్ రోడ్డు వెంబడి ఉన్న సరిహద్దు రాయి రెండు శతాబ్దాల క్రితం నెల్లూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉండేది. ఈ క్రమంలో రెండు జిల్లాల హద్దుగా అప్పట్లో ఆ రాయి ఆయా జిల్లాలకు స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటైందని భావిస్తున్నారు. 1850 ప్రాంతంలో నెల్లూరు, కృష్ణా(అనంతరం కృష్ణా జిల్లాగా మార్పు చెందింది) జిల్లాలు మాత్రమే ఉన్నాయి.
చీమకూర్తిలో మాజీ సైనికుడు వై.దే వరాజు(77) గురువా రం మృతి చెందారు. ఆయన గత కొన్నిరో జులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంగో లులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలు, అందుకు తగిన అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. గురు వారం ఒంగోలు ఎంపీడీవో కార్యాలయంలో మం డల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లి కార్జునరెడ్డి అధ్యక్షతన జరిగింది.