Home » Andhra Pradesh » Prakasam
సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరును ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు.
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఇన్చార్జి సెక్టోరల్ సిబ్బందిని నియమిస్తూ డీఈవో కిరణ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నలుగురు సభ్యుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని ఎంపిక చేసింది.
వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ టి.వసుంధర మరోసారి బదిలీ అయ్యారు. ఆమెను శ్రీకాళహస్తికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నెలక్రితం ప్రభుత్వం వసుంధరను నెల్లూరు జిల్లా డీఎల్డీవోగా బదిలీ చేసింది.
క్రిస్మస్ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని చర్చీలు క్రిస్మస్ శోభతో విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకుంటు న్నాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో భూ రికార్డుల్లో జరిగిన తప్పులను పరిష్కరించేం దుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయ ణరెడ్డి అన్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్లకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్ దంపతులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. స్థానిక పీటీఎస్ కల్యాణ మండపంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 600 మంది పాస్టర్ దంపతులకు వస్త్రాలను పంపిణీ చేశారు.
ప్రజోపకరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టే పనులతో నష్టపోయే బాధితులకూ అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు తో భూమిని కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంతో పాటు ఇంటి పట్టాలు మంజూరుచేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పట్టాలు అందజేశారు.
ఆంధ్రకేసరి యూనివర్సిటీ పురుషుల ఖోఖో జట్టు ఎంపిక సోమవారం పంగులూరులో జరిగింది. ఈ ఎంపికకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, బీపీఈడీ కళాశాలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
మండలంలోని కొండమంజులూరు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిన కొండమంజులూరు గోవింద నామంతో హోరెత్తింది.
ప్రస్తుతం కేడబ్ల్యుడీ(కృష్ణా వెస్ట్రన్ డెల్టా) పరిధిలోని ఆయకట్టులో సాగుదారులు పరిస్థితి సంకటంగా మారింది. సాగునీరు సక్రమంగా విడుద ల కాకపోవడం అందుకు కారణం. ఆయా సమస్యల పరిష్కారానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంది. తాజాగా ఎన్నికైన సాగునీటి సంఘాల బాధ్యులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి అడుగులు వేయాలని ఆయకట్టులోని రైతులు సూచిస్తున్నారు.