Home » Andhra Pradesh » Visakhapatnam
జిల్లాలో ప్రతి విద్యార్థికి ఆటోమేటెడ్ పర్మినెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నంబరు జారీ చేస్తున్నామని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు.
రక్త సేకరణ (బీసీటీవీ) రవాణా వాహనాన్ని నిధులు లేమి సమస్య పట్టి పీడిస్తున్నది. దీంతో రక్తదానంపై అవగాహన కల్పించడానికి, రక్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగుల క్రీడా పోటీలు డిసెంబరు ఆరు నుంచి విశాఖలో జరగనున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) జీవీ రవివర్మ పేర్కొన్నారు. ఎంవీపీకాలనీలోని ఆర్టీసీ ఈడీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కైలాసగిరి పోలీస్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీహరిపురం వీటీ కాలేజీ రోడ్డులో నివాసం ఉంటున్న నేవీ రిటైర్డు ఉద్యోగి సందీప్ (35) జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో ఇబ్బందులు, అన్నదమ్ములతో ఆస్తి వివాదాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బాలుడిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే తనువు చాలించాడు. జాతీయ రహదారి అగనంపూడి సమీపంలో గల బీసీ కాలనీ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మద్యం వ్యాపారంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం వస్తున్నారు.
కొన్ని వందల ఏళ్ల క్రితం భక్తురాలు విరాళంగా ఇచ్చిన భూమి ఎట్టకేలకు సింహగిరిపై ఉన్న కాశీవిశ్వేశ్వర పంచాయతన దేవాలయానికి చెందేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పనులను వచ్చే జనవరి నాటికి పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ ఆదేశించారు.
ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా నగర ట్రాఫిక్ పోలీసుల తీరు మారడం లేదు.