Home » Andhra Pradesh » Visakhapatnam
గ్రామ పంచాయతీ నుంచి గానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి గానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు కర్మాగారం యాజమాన్యం తన సొంత అవసరాల కోసం దర్జాగా రహదారిని వెడల్పు చేస్తున్నది. పైగా పనులకు అయ్యే వ్యయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి ఖర్చు చేయడం విశేషం.
జిల్లాకు మరో భారీ పరిశ్రమ రానున్నది. నక్కపల్లి కేంద్రంగా బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) కోసం ఏపీఐఐసీ సేకరించి సుమారు రెండు వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీంతో నక్కపల్లి, పరిసర ప్రాంతాలను ఫార్మా హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
విద్యార్థులకు ‘అపార్’ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ) నంబర్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల రాకతో ఆధార్ కేంద్రం వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
విశాఖ డెయిరీపై సభా సంఘం వేయాలని శాసనసభ నిర్ణయించింది. సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖ డెయిరీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, డెయిరీని రైతులకు కాకుండా చేసి ఓ కుటుంబం సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
శబరిమలై, తిరుమల, షిర్డీ రైళ్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. మండల దర్శనాలు ప్రారంభం కావడంతో ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్లకు తాకిడి పెరిగింది. ఎర్నాకులం రైళ్లకు జనవరి 19 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు. అలాగే షిర్డీ వెళ్లే సాయినగర్ ఎక్స్‌ప్రెస్‌కు (18503) జనవరి 16 వరకు, తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు (17488) డిసెంబరు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ఆ మూడు ప్రాంతాలకు విశాఖ మీదుగా నడిచే వారాంతపు రైళ్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డుకు మరో అదనపు ఆకర్షణ జత కాబోతోంది. నేవీ మ్యూజియం కాంప్లెక్స్‌లో యుహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం రానున్నది. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఆర్కే బీచ్‌రోడ్డులో పర్యాటకుల కోసం మ్యూజియాలు ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మూడు మ్యూజియాలు (కురుసుర సబ్‌మెరైన్, టీయూ-142 యుద్ధ విమానం, సీ హ్యారియర్ ఫైటర్ మ్యూజియం) ఏర్పాటయ్యాయి. నీటిలో మాత్రమే ఉండే సబ్‌మెరైన్‌ను అతి కష్టమ్మీద తీరానికి తీసుకువచ్చి మ్యూజియంగా మార్చారు. అలాగే టీయూ-142 యుద్ధ విమానాన్ని ఒకచోట నిలిపి...కాక్‌పిట్, లోపలి భాగాలు చూడడానికి పైకి మెట్లు నిర్మించారు. సీ హ్యారియర్ ఫైటర్ విమానాన్ని వినూత్నంగా గాలిలో వేలాడదీశారు. వీటి నిర్మాణం, సేవలు కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శనలుఏర్పాటుచేశారు.
విశాఖపట్నం పోర్టుకు ఇటీవల కాలంలో భారీ నౌకల రాక పెరుగుతోంది. పోర్టు లోపలకు నౌకలు వచ్చే ఛానల్ లోతు(డ్రాఫ్ట్)ను డ్రెడ్జింగ్ ద్వారా పెంచడం, అలాగే బెర్తుల వద్ద ఎక్కువ లోతు చేయడంతో భారీ నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈక్యు 6 బెర్తు లోతును 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు పెంచారు.
ఫార్మా పరిశ్రమలు మూత!
నిరుపేదలకు ఆరోగ్య భరోసాను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువజేసే వైద్యాన్ని ఉచితంగా అందించనుంది. పథకానికి సంబంధించి గతంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మిగిలిన వారికి కొద్దిరోజుల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
సీసీ రోడ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, గ్రావెల్ రహదారుల నిర్మాణానికి అడ్వాన్సుల పేరిట నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నారని సామాజిక తనిఖీల్లో బయటపడింది.