Home » Crime
పార్ట్‌టైం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని భావించిన ప్రైవేటు ఉద్యోగికి పెట్టుబడి ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.48 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతికాడు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మణుగూరు ప్యాసింజర్ రైలు(Manuguru Passenger Train)లో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. బళ్లారి(Bellary)కి చెందిన రమణమ్మ (46)కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.
భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటక(Karnataka)లోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు. వేరే పేరుతో ఓ రైతు తోటలో పనికి చేరాడు. అక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. పిల్లలైతే బయటకు చెప్పరనే ధీమాతో అభం శుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు ఒడిగడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా నిధులు మంజూరయ్యాయని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.1.32 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(33)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము జనరల్ బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకున్నారు.
ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ రెండేళ్ల చిన్నారి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ దుర్ఘటన మీర్పేట్ పోలీస్‌స్టేషన్(Meerpet Police Station) పరిధిలోని భూపేశ్‌గుప్తానగర్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది.
గొంతులో పూరీలు ఇరుక్కుని విద్యార్థి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్(Secunderabad)లో సోమవారం జరిగింది. ఓల్డ్ బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్ (11) పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న అక్షర వాగ్ధేవి ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు.
లక్నోలోని పీజీఐ పోలీస్‌స్టేషన్ పరిధి లోని కిసాన్ పథ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ మీద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు డ్రైవర్ చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమ కుటుంబంలో జరిగిన దారుణం మరో కుటుంబంలో జరగకూడదని, అమెరికా వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం తెలుసుకోవాలని, ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని అమెరికా జార్జియా(America)లో మృతి చెందిన ఆర్యన్‌రెడ్డి(Aryan Reddy) తండ్రి పాల్వాయి సుదర్శన్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
సైబర్ నేరగాళ్లు కొత్తపంథా ప్రారంభించారు. ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుండడంతో వేరే మార్గంలో దోచేందుకు యత్నాలు మొదలుపెట్టారు. నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు.