Home » Crime
తన అల్లరి తిరుగుళ్లను నిలదీస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. అంతేగాక ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఎవ్వరూ గుర్తు పట్టకుండా అటవీప్రాంతంలో విసిరేశాడు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లం కావడంతో చివరికి తను చేసిన తప్పును అంగీకరించాడు.
గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. కేపీహెచ్‌బీ ఎస్సై శ్రీలతారెడ్డి(KPHB SSI Sreelatha Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి(Anantapur District Kadiri)కి చెందిన కనంపల్లి విష్ణువర్దన్ (31) కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నంబర్-1లోని అమ్మ హాస్టల్లో ఉంటున్నాడు.
పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు.
ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. సరూర్‌నగర్(Sarurnagar) పరిధిలో ఈ ఘటన జరిగింది.
లండన్(London)లో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్తుండగా కూతురును ట్రక్కు ఢీకొట్టింది. కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. లండన్ వెళ్లి కన్నకూతురిని చూసేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం లేదా మానవతావాదులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.. వివరాలిలా ఉన్నాయి.
‘పనిచేయకుండా ఖాళీ ఎందుకుంటున్నావ్.. కిరాయిల డబ్బులు జల్సాగా ఖర్చు చేస్తే కుటుంబం ఎలా గడుస్తుంది’ అని నిలదీసినందుకు కుమారుడిపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. దీంతో కుమారుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్మన్‌ఘాట్(Karmanghat)లో చోటుచేసుకుంది.
ప్రేమించినవాడిని కాదని మరొకరితో బలవంతంగా వివాహం జరిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నవవధువు ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్(Petbashirabad Police Station) పరిధిలో జరిగింది.
కారు పార్కింగ్‌లో పెట్టాలని చెప్పినందుకు.. ‘నా కారునే ఆపుతావా’ అంటూ ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించిన ఘటన శుక్రవారం కూకట్పల్లి(Kukatpally) కోర్టు ప్రాంగణంలో జరిగింది. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)లో గుర్తుతెలియని వ్యక్తులు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును అపహరించుకుపోయారు. బ్యాగు కనిపించకపోవడంతో బాధితురాలు అబ్దుల్లాపూర్‌మెట్(Abdullahpurmet) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫుడ్ ఆర్డర్ చేసి, క్యాన్సిల్ చేసిన మహిళను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals), ఏపీకే లింక్‌ను పంపి రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన గృహిణి(38) జెప్టో యాప్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది.