Home » International
సిరియాలో మళ్లీ అంతర్యుద్ధ భయాందోళనలు నెలకొంటున్న వేళ ఆ దేశానికి రష్యా మద్దతుగా నిలిచింది.
డొనాల్డ్ ట్రంప్‌నకు కాష్ పటేల్ వీర విధేయుడిగా మంచి గుర్తింపు ఉంది. భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండ నుంచి కెనడాకు.. అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో గుజరాతీ భారతీయ దంపతులకు కాష్ పటేల్ జన్మించారు.
రష్యా దాడులు భయానకంగా ఉంటున్నాయని, వాటిని తట్టుకుని, ఎదురుదాడి చేసే వనరులు తమ వద్ద లేవని సైన్యంలో విధులకు ఎగనామం పెట్టిన సెర్హీ నెజ్డిలోవ్ అనే సైనికుడు పేర్కొన్నారు.
అమెరికాలో పలువురు పాకిస్థానీయులు వీధుల్లోకి వచ్చి నమాజ్ చేస్తూ నిరసనలు తెలిపారు. దీనికి ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా కెనడాలోని మిస్సిసాగా నగరంలో కూడా పీటీఐ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు.
పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా క్యాపిటల్ భవనంపై గత వారం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జక్ట్స్ (UFO)లు కనిపించాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రకాశవంతమైన లైట్లతో యూఎఫ్‌వోలు కనిపించాయంటూ జరిగిన ప్రచారం వైరల్ అయ్యింది.
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. పలువురు ఇస్లామిక్ వాదులు హిందువులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసి దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు దాడులు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నారు.
కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జై భట్టాచార్యను ఎంపిక చేశారు. దేశంలోని అత్యుత్తమ ఆరోగ్య పరిశోధన, నిధుల సంస్థలలో ఒకటైన అత్యున్నత పరిపాలనా పదవికి తొలి భారతీయుడు భట్టాచార్య నామినేట్ కావడం విశేషం.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రాంతాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఇవి అమలు కాకముందే ఇజ్రాయెల్ బీరూట్‌పై బలమైన దాడిని ప్రారంభించింది. ఈ ఘటనలో 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చుద్దాం.