Share News

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..

ABN , Publish Date - Nov 30 , 2024 | 07:02 AM

పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..
Nigeria Boat Capsizes

కొంత మందితోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, 100 మందికి పైగా మహిళలు తప్పిపోయారు. ఈ విషాధ ఘటన ఉత్తర నైజీరియా(Nigeria)లోని నైజర్ నది ఒడ్డున శుక్రవారం చోటుచేసుకుంది. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతున్న పడవలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు శుక్రవారం రాత్రి నాటికి నది నుంచి 27 మృతదేహాలను బయటకు తీయగలిగాయి, స్థానిక డైవర్లు ఇంకా ఇతరుల కోసం వెతుకుతున్నారు.


ప్రమాదానికి కారణం..

ఈ ఘటన తర్వాత రెస్క్యూ కార్మికులు గంటల తరబడి పడవను గుర్తించడానికి కష్టపడ్డారు. నీటి రవాణా కోసం భద్రతా చర్యలు, నిబంధనలను అమలు చేయడానికి అధికారులు పోరాడుతున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో ఇటువంటి ప్రాణాంతక ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే పడవ మునిగిపోవడానికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. పడవ ఓవర్‌లోడ్ అయి ఉండవచ్చని అక్కడి మీడియా చెబుతోంది. నైజీరియాలోని మారుమూల ప్రాంతాలలో పడవలపై రద్దీ సర్వసాధారణం. దీంతోపాటు మంచి రోడ్లు లేకపోవడం వల్ల చాలా మందికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో పడవలను ఆశ్రయిస్తున్నారు.


బోట్ల నిర్వహణ లేకపోవడం

చాలా ప్రమాదాలు ఎక్కువ మంది ప్రయాణీకులను ఎక్కించడం, భద్రతా చర్యలను పట్టించుకోకుండా ఉండటం వల్ల జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతోపాటు స్థానికంగా ఎక్కువ మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి తరచుగా నిర్మించబడిన పడవలకు నిర్వహణ కూడా సరిగా ఉండదని చెబుతున్నారు. ఇటువంటి ప్రయాణాలలో లైఫ్ జాకెట్ల వినియోగాన్ని సరిగా అమలు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నీటి రవాణా భద్రతా చర్యల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 30 , 2024 | 07:14 AM