Home » National
బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది.
అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్రం సవరించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేసింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు బుధవారం భేటీ కానున్నాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ కీలక సమావేశం జరగనుంది. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు.
అణు విద్యుత్ కేంద్రం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(77), కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
కరుడుగట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అనుచరుడిగా ఉన్న రోహిత్ గొదారా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్టు తెలిపాడు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రహదారులపై అర అడుగు నుంచి ఒక అడుగు మేర మంచు గడ్డకట్టింది
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడి అయిదుగురు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కేరళలో సమృద్ధిగా ఉన్న థోరియం నిక్షేపాలను సద్వినియోగం చేసుకొని తమ రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేయాలని కేంద్రమంత్రి మనోహర్ ఖట్టర్‌ను ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కృష్ణణ్‌కుట్టి కోరారు.
రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు.