Share News

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:49 AM

రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

మిజోరాంకు జనరల్‌ వీకే సింగ్‌

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు ఒడిశా నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మిజోరాం గవర్నర్‌గా ఉన్నారు. ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా గవర్నర్‌ పదవికి రఘుబర్‌ దాస్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో హరిబాబును నియమించారు. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ను బిహార్‌కు, బిహార్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కేరళకు బదిలీ చేశారు. మణిపూర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాను, మిజోరాం గవర్నర్‌గా జనరల్‌ విజయ్‌కుమార్‌ సింగ్‌ను నియమించారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరిబాబును ప్రధాని మోదీ ఫోన్‌లో పరామర్శించినట్లు తెలిసింది. కాగా, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు నియమితులు కావడం సంతోషకరమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన నియామకంతో ఏపీ, ఒడిశా సరిహద్దు సమస్యలతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి, ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 25 , 2024 | 03:49 AM