Home » 2024
మండలంలోని గొల్ల పల్లి వద్ద 44వ జాతీయ రహ దారి పక్కన ఉన్న హై ఓట్టేజ్ విద్యుత స్తం భాన్ని పూర్తిగా పిచ్చి మొక్కలు, తీగ లు అల్లుకున్నాయి. స్తంభం నిలువునా ఎగబాకాయి. జాతీయ రహదారి పక్క నే ఇలా ఉన్నా విద్యుత శాఖ అధికా రులు పట్టించు కోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
యువత భాగస్వామ్యంతోనే అవినీ తి రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని నె హ్రూ యువకేంద్రం అధి కారులు పేర్కొన్నారు. కేం ద్ర క్రీడలు యువజన శా ఖ, మై భారత, నెహ్రూ యువకేంద్రం, ప్రగతిపథం యూత అసోసి యేషన, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎనవైకే కార్యాలయంలో విజి లెన్స వారోత్సవాలు నిర్వహించారు.
మండలంలోని అక్కంపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు యత్నించ గా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రాచానపల్లి పొలం సర్వే నెంబరు 160-1లోని 4.02 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దళితుల ముసుగులో గుడిసెలు వేసేందుకు ఆదివారం ప్రయ త్నాలు చేశారు.
లోకరక్షణకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగర శివా రులోని ఇస్కాన మంది రంలో గోవర్ధనరిపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నకూటమితో గోవర్ధనిగిరిని ఏర్పాటుచేసి, రకరకాల పండ్లు, కూరగాయలతో గిరిని అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎన్ని రోజులు తిరిగినా స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడి అధికారులు ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళతారో..? అర్థం కావడం లేదని మండి పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రం వచ్చారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో తట్టెడు మట్టి కూడా రోడ్లపై వేయనిదుస్థితి ఉండేదని, అదే కూటమి ప్రభుత్వంలో గుంతల రోడ్లకు మోక్షం లభించిం దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని కనగానపల్లిలో శనివారం ప్రారంభించారు. స్థానిక పండమేరు వంక వద్ద ఉన్న గతుకుల రోడ్లను చదును చేసి, తారు రోడ్డు నిర్మించే పనులను ఆర్అండ్బీ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద ఉన్న సప్తగిరి క్యాంపర్ పరిశ్రమలో ఆర్-3 రియాక్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా విష వాయువులు వెలువడ్డాయి. వెల్డింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రియాక్టర్ నుంచి వెలువడిన ఐసో బ్రొనైల్ అసిటేట్ వాయువును పీల్చిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది
విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి ...
రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు.