Share News

MLA SUNITA : కూటమితో గుంతల రోడ్లకు మోక్షం

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:22 AM

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో తట్టెడు మట్టి కూడా రోడ్లపై వేయనిదుస్థితి ఉండేదని, అదే కూటమి ప్రభుత్వంలో గుంతల రోడ్లకు మోక్షం లభించిం దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని కనగానపల్లిలో శనివారం ప్రారంభించారు. స్థానిక పండమేరు వంక వద్ద ఉన్న గతుకుల రోడ్లను చదును చేసి, తారు రోడ్డు నిర్మించే పనులను ఆర్‌అండ్‌బీ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA SUNITA : కూటమితో గుంతల రోడ్లకు మోక్షం
MLA Paritala Sunitha is starting the work of filling potholed roads

ఎమ్మెల్యే పరిటాల సునీత

కనగానపల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ హయాంలో తట్టెడు మట్టి కూడా రోడ్లపై వేయనిదుస్థితి ఉండేదని, అదే కూటమి ప్రభుత్వంలో గుంతల రోడ్లకు మోక్షం లభించిం దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని కనగానపల్లిలో శనివారం ప్రారంభించారు. స్థానిక పండమేరు వంక వద్ద ఉన్న గతుకుల రోడ్లను చదును చేసి, తారు రోడ్డు నిర్మించే పనులను ఆర్‌అండ్‌బీ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ పాలనలో ప్రజలు ప్రయాణించాలంటే గుంతల రోడ్లతో ఇబ్బందు లు పడేవారన్నారు. అవసరమున్నచోట కూడా కనీసం మట్టిని వేయలేదన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే రా ప్తాడు నియోజకవర్గంలో మంజూరైన రోడ్లను కూడా వేయనీకుండా అప్పటి ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి అడ్డుకు న్నారన్నారు. ఏపీలో ప్రయాణుకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి ప్రభుత్వం రూ.860 కోట్ల నిధు లను మంజూరు చేసిందన్నారు.


నియోజకవర్గంలో 11 రోడ్లకు రూ.2.84 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 318 కిలోమీటర్లు రహదారి ఉండగా, 125.35 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో 94 కిలో మీటర్ల వరకు మరమ్మతుల పనులు చేపడుతామని, మిగిలిన దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ జేఈ హారిక, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీఓ అనిల్‌కుమార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేశ, కన్వీనర్‌ యాతం పోతలయ్య, సుదాకర్‌చౌదరి, సర్పంచ రామకృష్ణ, ఎంపీటీసీ బిల్లేబాస్కర్‌, తెలుగుయువత బట్టా సురేశచౌదరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 03 , 2024 | 12:22 AM