Home » 2024
ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్‌జీఎస్ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.
హిందూపురం మునిసిపల్ పీఠం కోసం ఆశావహులు ఆరాట పడుతుండగా, పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీలో 38వార్డులు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, టీడీపీ ఆరు, ఎంఐఎం, బీజేపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. 19వ వార్డు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్ ఇంద్రజకు చైర్‌పర్సన పదవిని అప్పగించారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ...
తుఫాను, అధిక వర్షాల కారణంగా పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని, రైతులను ఆదుకోవాలని జిల్లా పరిషత సభ్యులు డిమాండ్ చేశారు. వేరుశనగ, పత్తి, కొర్ర, మిర్చి తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వారికి పరిహారం ఇవ్వాలని మంత్రిని, జిల్లా కలెక్టర్‌ను కోరారు. మెజార్టీ చెరువులకు నీరు ఇవ్వాలని కోరారు. ఫించన్ల రద్దు అంశంపై వైసీపీ జడ్పీటీసీలు, మడకశిర ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. అనర్హుల పింఛన్లను రద్దు చేస్తారని, కూటమి ప్రభుత్వం కొత్తగా 15 లక్షల పై చిలుకు కొత్త ఫించన్లు ఇస్తోందని మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. జిల్లా పరిషత సర్వసభ్య ...
తుఫాను వర్షాలతో నల్లరేగడి నేలలు పదునయ్యాయి. దీంతో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. తడి ఆరగానే విత్తనం వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు వర్షం కురవకపోతే విత్తనం వేస్తామని రైతులు అంటున్నా రు. ఇప్పటికే పలువురు రైతులు విత్తన పప్పుశనగ కొనుగోలు చేసి ఇళ్లలో సిద్ధంగా ఉంచు కున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.18 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో పప్పుశనగ 72 వేల హెక్టార్లలో సాగవుతుంది. మిగతా...
ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..
రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన కోసం ఎంతకైనా తెగించేవారు. ఇప్పుడు బిడ్డల చదువుల కోసం అంతకు మించి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పల్లెటూరి తల్లిదండ్రులు చెమటను కరెన్సీ మూటలుగా మార్చి కార్పొరేటు విద్యాసంస్థలకు కట్టబెడుతున్నారు. తమలాగా పిల్లలు కష్టాలు పడకూడదన్న తాపత్రయం వారిది. ఈ ఆలోచనతో ఇంటికి, ఊరికి దూరంగా.. నగరాలకు తీసుకువెళ్లి హాస్టళ్లలో వదులుతున్నారు. అక్కడ ...
శారదా నగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు.
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టా లని చూస్తే సహించేది లేదని విజిలెన్స ఎస్పీ వైటీపీటీఏ ప్రసాద్ హెచ్చ రించారు. ఆయన శుక్రవారం విజిలెన్స కార్యాలయంలోని తమ చాంబర్లో కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
కార్మికులకు అన్యాయం చేస్తున్న అవినీతి ఎంహెచఓ విష్ణుమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో బదిలీ చేసి పంపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై శుక్రవారం మున్సిపల్ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆందోళన చేపట్టారు.