Share News

MLA SUNITA : గ్రామస్థుల నిర్ణయం మేరకే అభివృద్ధి పనులు

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:14 AM

గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్‌జీఎస్‌ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.

MLA SUNITA : గ్రామస్థుల నిర్ణయం మేరకే అభివృద్ధి పనులు
MLA Paritala Sunitha who participated in the Gangampally Tanda

పల్లె పండుగలో ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్‌జీఎస్‌ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం రాకమునుపు, వచ్చిన తరువాత గ్రామాల్లో అభివృద్ధి ఎలా సాగుతుందో ప్రజలే గమనించాలన్నా రు. గతంలో గ్రామాలకు రోడ్లు వేయాలని ఎన్నిసార్లు విన్నవించిన పట్టిం చుకోలేదన్నారు. అంతకుమునుపు తాము మంజూరు చేయించిన రోడ్లను కూడా వేయనీయలేదన్నారు,


టీడీపీ అధికారంలోకి వచ్చాక రాప్తాడు ని యోజకవర్గానికి మాత్రమే రూ.25కోట్లు వచ్చాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పనులు జరుగుతాయని నాణ్యత లోపంపై ప్రశ్నించే అర్హ త మీకుందన్నారు. అనంతరం గంగంపల్లితండాలో సమస్యలపై గ్రామస్థు లతో చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ భవనం, అంగనవాడీ కేంద్రం, ప్రభుత్వపాఠశాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆ దేశించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రదానకార్యదర్శి మారుతిప్రసాద్‌, సర్పంచ లలితమ్మ, ఎంపీడీఓ ఆజాద్‌, డీఈ లక్ష్మీనారాయణ, తెలుగుయువత శ్రీధర్‌నాయుడు,, గంగాధర్‌, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 12:14 AM