Home » 2024
జిల్లా కేంద్రమైన నగరంలో రహదారుల విషయంలో ఇంకా మార్పు రాలేదు. చాలా చోట్ల ఇంకా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో గుంతలు లేని రోడ్లు చేస్తామని గొప్పలు చెప్పినా అమలుకు నోచుకోలేదు. దాదాపు ఏడాది కాలంగా బిల్లులు కాకపోవడంతో, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
ఎండుమిర్చి పంట అన్నదాతకు నష్టాలఘాటు పంచింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పక్వానికి వచ్చిన కాయలు రాలిపోయి, దిగుబడి దారుణంగా పడిపోయింది. కాయల నాణ్యత కూడా తగ్గుతోంది. ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. వెరసి నష్టాల పంట పండుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కవని అన్నదాతలు వాపోతున్నారు....
బుక్కపట్నం పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్ నాలుగు ఆస్పత్రులకు ఇనచార్జిగా కొనసాగుతున్నారు. బుక్కపట్నం మండలంలోని క్రిష్ణాపురం, మారాల, పాముదుర్తి, కొత్తచెరువు మండలంలోని ఆస్పత్రులకు ఆయన ఒక్కరే వైద్యుడు. ఆయన ఏరోజు ఏ ఆస్పత్రిలో విధులు నిర్వహించాలో అర్థంకాని పరిస్థితి. పశువైద్యశాఖలో ఖాళీలకు ఇది నిదర్శనం. వైద్యులతోపాటు సిబ్బంది పరిస్థితి కూడా ఇలానే ఉంది....
అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచమెనగా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను ...
మండల కేంద్రంలోని మహా త్మాజ్యోతి రావు ఫూలే గురు కుల బాలికల పాఠశాల కు ఐఎస్ఓ(ఇంటర్నేషనల్ స్టాం డర్డ్ ఆర్గనైజేషన )సర్టిఫికెట్ వచ్చినట్లు గురుకుల పాఠశా లల కన్వీనర్ సంగీత కుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
క్రైస్తవులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జీసెస్ నగర్‌లోని ఫెయిత చర్చ్‌లో సోమవారం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యప్రసంగీకులుగా పాస్టర్ విజయ్‌కు మార్, ముఖ్యఅథితిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు.
వైద్యవృత్తి ఎంతో విలు వైనదని, అందరూ క్రమశిక్షణతో ఉంటూ కళాశాలకు మంచిపేరు తీసుకు రావాలని మెడికల్ కలాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు నూతన మెడికోలకు హితబోధ చేశారు. కళాశాల ఆడిటోరియంలో సోమవారం 2024-25 విద్యాసంవత్సరం నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఓరియెంటేష న సదస్సు నిర్వహించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృ ద్ధి దిశగా పరుగులు తీస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొం దని ఎమ్మెల్యే పరిటాలసునీత పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సోమవారం దాదులూరు పంచాయతీలో ఆమె పర్యటించారు.
జిల్లా కేంద్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి ముగిశాయి. పాతూరు, కొత్తూరు అమ్మవారిశాలల్లో ఆదివారం సాయంత్రం శయనోత్సవ సేవలతో వేడుకలను ముగించారు. పాతూరు అమ్మవారి శాలలో వాసవీమాత మూలవిరాట్‌ను కొబ్బరితో అలంకరించి పూజించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తితో శయనోత్సవ సేవ నిర్వహించారు.
జిలా ్లకేంద్రం లోని ఆర్ఎఫ్ రోడ్డులో వెలసిన లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాల యంలో ఆదివా రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడికి చక్రస్నా నం నిర్వ హించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు.