Share News

MLA : ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:59 AM

అధికారంలో ఉండగా రైతుల గురించి ఏ మార తం పట్టించుకోకుండా, విద్యుతరంగాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ అఽధినేత వైఎస్‌ జగన ఇప్పుడు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎమ్మె ల్యే పరిటాలసునీత విమర్శించారు. మండలం లోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేక రుల సమావేశంలో మాట్లాడారు.

MLA :  ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం
Electricity burden on people is YCP's sin

రామగిరి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా రైతుల గురించి ఏ మార తం పట్టించుకోకుండా, విద్యుతరంగాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ అఽధినేత వైఎస్‌ జగన ఇప్పుడు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎమ్మె ల్యే పరిటాలసునీత విమర్శించారు. మండలం లోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేక రుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత చా ర్జీలపై వైసీపీ శుక్రవారం నిర్వహించిన నిరసన ను తీవ్రంగా ఖండించారు. వారు చేపట్టిన నిరసన ఒక ప్లాప్‌షోను తలపించిందని, ప్రజలే కాకుండా సొంతపార్టీ నాయకులు కూడా ఈ నిరసనను పట్టించుకోలేదన్నారు. వైసీపీ అధినేత జగనకు గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ విద్యుతచార్జీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నా రు. వైసీపీ హయాంలో సీఎం హోదాలో జగన పెంచిన విద్యుతచార్జీల పట్ల వారే నిరసనకు పిలుపు నివ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఐదేళ్లలో రైతుల గురించి ఏనాడు మాట్లాడని వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్లు ఎక్కడం సిగ్గుచేటన్నారు. మం డలంలోని రైతులకు డ్రిప్‌, స్ర్పింకర్లు సబ్సిడీపై యంత్రపరికరాలు అందిస్తున్నా మన్నారు. వాస్తవాలు విడిచి వైసీపీ కరపత్రిక కూటమి ప్రభుత్వంపై దుష్పచారం చేస్తోందన్నారు. దీన్ని ప్రజలే గమనించి వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 29 , 2024 | 12:59 AM