Home » 2024
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, ఇన్ఫాఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నాయకులు సప్తగిరి సర్కిల్లో నిరసన తెలిపారు.
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆరోరోజున మంగళవారం హనుమద్ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించా రు.
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ‘దారులు’ ఒకటి. గుంతలమయమైన రోడ్ల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో పల్లె ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా మట్టి వేసి దారులను బాగు చేసుకున్నారు. విడపనకల్లు మండలంలోనూ ఇదే తరహాలో రైతులు చందాలు వేసుకుని పనులు చేసుకున్నారు. కానీ ఈ పనులు తామే చేసినట్లు చూపించుకుని.. కొందరు వైసీపీ ...
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున మంగళవారం అమ్మ వారు పలుప్రాంతాల్లో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో మూలవిరాట్లతోపాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించా రు. కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్ను వక్కలతో అలంకరించి, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులతో కంచి కా మాక్షి, వాసవీదేవి, సంతోషిమాత అలంకారం చేశారు.
నాడు - నేడు అంటూ ఊదర గొట్టిన గత వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉందో చెప్పడానికి... నగరంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలే నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం రెండో రోజు స్థానిక హౌ సింగ్ బోర్డులో పర్యటిం చారు.
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని..
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు సోమవారం శ్రీనివాసుడు గరుడవాహనంపై కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్లకు వి విధ అభిషేకాలు, కుంకుమార్చన, తోమాలసేవ, అలంకారసేవ నిర్వ హించారు.