Home » Adani Group
ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ హైడల్ పవర్ ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు మూడు రోజుల క్రితం అడ్డుకున్నారు. మంగళవార జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.
ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.
పార్లమెంటులో ‘అదానీ’ దుమారం ఆగడం లేదు. శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలూ జరగలేదు.
కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ భారీ నష్టాలను చవిచూసిన అదానీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అదానీకి చెందిన చాలా సంస్థల షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల విలువ 90 వేల కోట్లకు పైగా పెరిగింది. అదానీ షేర్లు రాణింపుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్‌పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై యూఎస్‌లో లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే వార్తల్లో వాస్తవం లేదని గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. వారు సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులు ఎదుర్కొంటున్నారని వివరించింది.
‘‘తెలంగాణకు చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించావ్.. మరి దావోస్‌లో ఆయనతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి రేవంత్‌రెడ్డీ?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.