Home » America
మూడు రోజుల పర్యటనలో మోదీ విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో బైడెన్‌తో సమావేశమవుతారు.
మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.
క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల పర్యటనకు అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగించంతోపాటు పలువురు నేతలతో భేటీ కానున్నారు.
అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిందట.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. రక్త సంబంధిత సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితురాలికి వేసిన వ్యాక్సిన్ వికటించింది. దీంతో బాధితురాలి ముఖం గుర్తు పట్టరానంతగా మారిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ ప్రాంతంలో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ తృటీలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా ఘటనలు ఆమోదయోగ్యమైనవి కావని స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా దాడికి యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల వయసున్న ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.