Share News

Donald Trump's: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ రౌత్: అతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:16 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ ప్రాంతంలో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ తృటీలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Donald Trump's: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ రౌత్: అతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ ప్రాంతంలో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ తృటీలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.


అనంతరం ఈ కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌తోపాటు కెమెరాను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ర్యాన్ రౌత్ పోలీసు విచారణలో ఏ మాత్రం టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా ఉన్నాడని పోలీసులు తెలిపారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారంటూ వారిని ప్రశ్నించకుండా సైలెంట్‌గా ఉన్నాడని పేర్కొన్నారు.


ఈ కాల్పుల ఘటనపై ఇప్పటికే దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారని ఆయన ప్రచారం ప్రతినిధి స్టివెన్ తెలిపారు. ఇంకోవైపు కాల్పులకు తెగ బడిన ర్యాన్ రౌత్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాను మెటా సంస్థ స్తంభింపచేసింది.

Also Read: Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం


రౌత్ గత చరిత్ర అంతా...

ర్యాన్ వెస్లీ రౌత్‌కి సంబంధించిన గత చరిత్ర అంతా అనుమానాస్పదంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అతడు ఉక్రెయిన్‌‌కు మద్దతుదారునిగా ఉన్నాడని తెలిపారు. అందులో భాగంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై యుద్దానికి అతడు సహాయ సహకారాలు అందించినట్లు ఓ మీడియాకు సైతం ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పేర్కొన్నాడని పోలీసులు వివరించారు.

Also Read: Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు


అలాగే గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం తాను ది ఇంటర్నేషనల్ లీజియన్ ఆప్ ఉక్రెయిన్‌లో వాలంటీర్లను రిక్రూట్ చేస్తున్నట్లు వివరించాడని గుర్తు చేశారు. డెమోక్రటిక్ సానుభూతి పరుడుగా ఉన్న ర్యాన్ రౌత్.. ఆ పార్టీకి భారీగా విరాళాలు సైతం అందించినట్లు తెలుస్తుంది. ర్యాన్.. తన సోషల్ మీడియా ఖాతాల్లో తాను ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొన్నానని చెప్పుకున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ సందర్బంగా గుర్తించారు.

Also Read: Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ


తాలిబన్ల కారణంగా.. ఆఫ్గానిస్థాన్ నుంచి పారిపోయిన ఆ దేశ సైనికులకు ఉక్రెయిన్ పంపినట్లు సోదాహరణగా వివరించారు. అలాగే నాలుగేళ్ల క్రితం అతడు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలిపాడు. అక్కడ ఉన్న ఉక్రెయిన్ వాలంటీర్ సెంటర్‌కు తానే అధిపతినంటూ ఈ సందర్భంగా ప్రకటించాడు. ర్యాన్ రౌత్‌పై భారీగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసుతోపాటు పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో అతడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు.

For More International News and Telugu News

Updated Date - Sep 18 , 2024 | 09:27 AM