Home » Amit Shah
నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్ సేవలను మరింత వేగంగా అందించటానికి వీలుగా కేంద్రప్రభుత్వం ‘ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగామ్’ (ఎఫ్టీఐ-టీటీపీ).....
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రియాసీ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తీవ్రవాదులకు ఆయుధాలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను అణచివేసేందుకు ఏరియా డామినేషన్, జీరో టెర్రర్ ప్లాన్లను అమలు చేయాలని ఏజెన్సీలను ఆయన ఆదేశించారు.
జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల రోజురోజుకు పెరుగుతోన్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో జరిగింది.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ చక్కగా పనిచేసినట్టుగా అనిపిస్తోంది.