Share News

Amith Shah:‘మణిపూర్’పై ఉన్నత స్థాయి సమీక్ష: డుమ్మా కొట్టిన సీఎం

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:31 PM

మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.

Amith Shah:‘మణిపూర్’పై ఉన్నత స్థాయి సమీక్ష: డుమ్మా కొట్టిన సీఎం

న్యూఢిల్లీ, జూన్ 17: మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజిత్ భల్లా, ఐబీ చీఫ్ తపన్ దేఖా, మణిపూర్ భద్రతా సలహాదారు కులదీప్ సింగ్‌తోపాటు ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీ, అసోం రైఫిల్స్ డీజీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బైరాన్ సింగ్ మాత్రం ఈ సమీక్షా సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.

Also Read: Assembly Elections: గెలుపు కోసం పావులు కదుపుతున్న బీజేపీ


Also Read: Kanchanjungha Express collision: పలు రైల్వే సర్వీసులు రద్దు.. మరికోన్ని దారి మళ్లింపు

మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఇటీవల కొలువు తీరింది. ఈ నేపథ్యంలో వరుసగా పలు రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతను ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ క్రమంలో ఆ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని అణిచి వేయాలంటూ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Read Latest National News and Telugu States News

Updated Date - Jun 17 , 2024 | 05:31 PM