Home » Anantapur urban
భూబాధితుల రాష్ట్ర సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించనున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు.
చదువొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని పలువురు వక్తలు అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నక్కా రామారావు యాదవ చారిటబుల్ ట్రస్టు, యాదవ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని నక్కా రామారావు యాదవభవనంలో 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన 100 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
నోసేల్ కింద టమోటాను వృథాగా పడేయవద్దని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ సూచించారు. సోమవారం కక్కలపల్లి టమోటా మార్కెట్‌ను ఆయన సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడారు.
కోల్‌కతాలో మహిళా డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని పౌర చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం వేదిక ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
మోడల్ స్కూళ్లలో నియమితులైన ప్రిన్సిపాళ్లు, టీచర్లకు రెగ్యులర్ టీచర్ల సర్వీసు ప్రయోజనాలను అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉపాధ్యాయభవనలో ఎస్టీయూ అనుబంధ సంస్థ ఏపీమోడల్ స్కూల్స్ ఎస్టీయూ(ఏపీఎంఎ్సఎస్టీయూ) జిల్లా కార్యవర్గసమావేశం నిర్వహించారు.
ఒక చెట్టే కదా..! పోతే పోయిందిలే అని అనుకోకుండా దానికి మళ్లీ ప్రాణం పోయడానికి తపిస్తు న్నారు. నగరంలోని గ్రీనఆర్మీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈక్రమంలోనే నగరంలోని పాతూరులో విద్యుత్తు తీగలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉన్న 40 ఏళ్ల వయస్సున్న మేడి చెట్టును కార్పొరేషన అధికారులు ఆదివారం తొలగించారు.
ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలకు అభినందన సభ నిర్వహించి శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని సత్యసాయి తాగునీటి కార్మికులు డిమాండ్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్లూరులోని సత్యసాయి పంపుహౌస్ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి మూడు రోజులకు చేరుకుంది.
జిల్లా వ్యాప్తంగా సాగులోని ఉద్యాన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉద్యానశాఖ అధికారి నరసింహారావు ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.
జిల్లావ్యాప్తంగా ఖరీ్‌ఫలో సాగుచేసిన పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.