MLA SRAVANI: మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభిస్తాం
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:39 PM
మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
శింగనమల, సెప్టెంబరు 13: మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట పరిశ్రమను మూత వేశారని, గతంలో ఉన్న ప్రభుత్వలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన పరిశ్రమను ప్రారంభిస్తామన్న హామీని గాలికి వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో ఉందని పరిశ్రమను తిరిగి ప్రారంభించి దళిత యవతకు ఉపాధి చూపుతామన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. ఆర్డీఓ వసంతబాబు, పరిశ్రమల శాఖ మేనేజర్ నాగస్వామి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ నిర్మలాకుమారి, టీడీపీ మండల కన్వీనర్ ఆదినారాయణ, తెలుగుయవత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, చితంబరిదొర, ఈశ్వర్‌రెడ్డి, చిదానందనాయుడు, చండ్రాయుడు, విశ్వనాథ్, రవీంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.