Home » Anantapur
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున గురువారం చంద్రప్రభవాహనంపై గోవిందుడు కనువిందు చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈనేపథ్యంలో స్థానిక కొత్తూరు( గుల్జార్‌పేట)లోని వాసవీ కన్యకాపరమేశ్వ రి ఆలయంలో మూలవిరాట్‌ను చిలుకలతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులకు మధురవీరన, నాగదేవతల అలంకరణ చేశారు. పాతూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను రంగుల బటన్లతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తిని మహిశాసుర మర్దినిగా అలంకరించారు.
గత వెసీపీ హయాంలో పా లకులు చేసిన తప్పులు నగర ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అశోక్ నగర్లో ఎమ్మెల్యే పర్య టించారు. స్థానికంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అశోక్‌నగర్ బ్రిడ్జి ఎత్తులో కట్టాలని గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రోడ్డుకు సమానంగా కట్టడంతో డ్రైనేజీ సమస్య ఎక్కువైందన్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, ఇన్ఫాఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నాయకులు సప్తగిరి సర్కిల్లో నిరసన తెలిపారు.
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఆరోరోజున మంగళవారం హనుమద్ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్లకు సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవ నిర్వహించా రు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున మంగళవారం అమ్మ వారు పలుప్రాంతాల్లో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో మూలవిరాట్లతోపాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించా రు. కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను వక్కలతో అలంకరించి, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులతో కంచి కా మాక్షి, వాసవీదేవి, సంతోషిమాత అలంకారం చేశారు.
నాడు - నేడు అంటూ ఊదర గొట్టిన గత వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉందో చెప్పడానికి... నగరంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలే నిదర్శనమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం రెండో రోజు స్థానిక హౌ సింగ్ బోర్డులో పర్యటిం చారు.
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు సోమవారం శ్రీనివాసుడు గరుడవాహనంపై కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్లకు వి విధ అభిషేకాలు, కుంకుమార్చన, తోమాలసేవ, అలంకారసేవ నిర్వ హించారు.
సమస్యలను పరిష్కరించాలని బా ధతులు కలెక్టరేట్‌కే క్యూకట్టారు. గతవారం జిల్లాకేంద్రంలోని డీఆర్డీఏ కార్యా లయంలో అనంత రెవెన్యూ డివిజన గ్రీవెన్స మొదలు పెట్టి, కలెక్టరుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీంతో గత సోమ వారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి గ్రీవెన్సకు కేవలం112అర్జీలు మా త్రమే వచ్చాయి.డివిజన స్థాయి గ్రీవెన్సకు 290వరకు వచ్చాయి.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు సోమవారం జిల్లా వ్యాప్తం గా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో గుల్జార్ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మూలవిరాట్‌ను నవధాన్యాలతో, ఆల య ఆవరణలో ఉత్సవమూర్తులను శైలపుత్రిదేవి, గాయత్రిదేవి, సిద్ధిధాత్రి దేవిగా అలంకరించారు.