Home » Anantapur
జిల్లా సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ కేడర్ల కు చెందిన సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించా రు. స్వచ్ఛతాహిసేవ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎంఎన ఓలు, ఎఫ్‌ఎనఓలు, డైట్ సిబ్బందికి రక్తపరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామెర్ల వ్యాధి రాకుండా ఉండేందుకు హెపటైటీస్ వ్యాక్సిన వేశారు.
మండలపరిధిలోని రోటరీపు రం వద్ద ఉన్న అంబేడ్కర్ గురుకల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీ లించగా ఎండిపోయిన ఆకుకూరలు, నాసిరకం, కూరగాయలు, చిన్న సైజు కోడిగుడ్లు ఉండడంతో... ప్రిన్సిపాల్ విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో ఆహారం వండి పెడితే పిల్లల ఆరోగ్యం ఏం కావాలి? అని ఆగ్రహించారు.
పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులను ట్రాన్సఫా ర్మర్లు, స్టార్టర్ల దొంగలు మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వ్యవసా య తోటల్లో బోరుబావులకు అనుసంధానం చేసిన విద్యుత ట్రాన్సఫార్మర్లను, స్టార్టర్ పెట్టెలను ధ్వంసం చేసి అందులోని విలువైన సామగ్రిని ఎత్తుకెళుతున్నారు.
పట్టణంలో అర్హతలేని రెండు ప్రైవేట్ క్లినిక్‌లు, ఒక మొలల క్లినిక్‌ను సీజ్ చేసినట్లు డీఎంహెచఓ భ్రమరాంబికాదేవి తెలిపారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న మరో మూడు ప్రైవేట్ క్లినిక్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.
చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.
స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్‌లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.
తాము వంద రోజుల పాలనలో ఏం చేశామో అదే చెబుతున్నామని, అందుకే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నా మని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అంతే దైర్యంతో వైసీపీ నాయ కులు ప్రజల్లోకి వెళ్లగలరా...? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రామ గిరిలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. వందరోజుల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రజలకు నష్టం కలిగిస్తే సహించేది లేదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని ఎ నారాయణపురం పంచాయితీ స్టా లిన నగర్లో గురవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.