VILLAGE : మారుతున్న పల్లె రూపు రేఖలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:46 AM
గత వైసీపీ పాలనలో పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక పోవ డంతో గ్రామాలు వెలవెలబోయాయి. ఆ ఐదేళ్లలో తూతూ మంత్రంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి మమ అనిపించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పల్లెల రూపు రేఖలు మా రుతున్నాయి. గ్రామాల్లో సీ సీ రోడ్ల నిర్మాణానికి భారీ గా నిధులు మంజూరు చే యడంతో ఇప్పటికే పనులు చేస్తున్నారు.
గ్రామాల్లో సాగుతున్న సీసీ రోడ్ల పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణులు
రాప్తాడు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక పోవ డంతో గ్రామాలు వెలవెలబోయాయి. ఆ ఐదేళ్లలో తూతూ మంత్రంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి మమ అనిపించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పల్లెల రూపు రేఖలు మా రుతున్నాయి. గ్రామాల్లో సీ సీ రోడ్ల నిర్మాణానికి భారీ గా నిధులు మంజూరు చే యడంతో ఇప్పటికే పనులు చేస్తున్నారు. గత ప్రభు త్వంలో పంచాయతీల అభి వృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో వైసీపీ సర్పం చులు కూడా అప్ప ట్లో అసహనం వ్యక్తం చేశారు. కూటమి అధికా రంలోకి రాగానే సీఎం చం ద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా భారీ మొత్తంలో నిధు లు మంజూరు చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు పూర్తి చేశారు. మిగతా గ్రామాల్లో పనులు చేసు ్తన్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామాల్లోనే... పనులు: రాప్తాడు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి విడుతలో రూ. 2 కో ట్లు నిధులు మంజూరయ్యాయి. మండలంలోని బండ మీదపల్లి, వరిమడుగు, రామినేపల్లి, ముస్లిం మైనార్టీ కాలనీ, (రాప్తాడు పంచాయతీ), చిన్మయ్‌నగర్ (ప్రసన్నాయ పల్లి పంచాయతీ), యర్రగుంట, హం పాపురం, గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు, మరూరు, ఎం చెర్లోపల్లిలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మించను న్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కొన్ని గ్రామాల్లో భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా, వేగంగా జరుగుతున్నాయి.
వేగంగా పూర్తి చేస్తాం - కిషోర్ కుమార్, పీఆర్ ఏఈఈ
రాప్తాడు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూర య్యాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు పూర్త య్యాయి. మిగతా గ్రామాల్లో పనులు చేస్తున్నారు. పనులను నాణ్యంగా, వేగంగా పూర్తి చేస్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....