Home » Anantapur
ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థినులకు వసతి, భోజనం, విద్య ఏ స్థాయిలో అమలు పరుస్తారో.. వారి భధ్రత విషయంలోనూ అదేస్థాయిలో చర్యలు చేపటా ్టలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత సం బంధిత వార్డెన్లపై ఉంటుంది. అయితే కొందరు వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి.
ఉత్సాహంగా పా రా క్రీడాకారుల అథ్లెటిక్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల దినోత్సవాన్ని పు రస్కరించుకుని సోమవారం స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో పారా క్రీ డాకారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. షాట్‌పుట్, డిస్కస్ త్రో, 100, 200మీటర్ల రన పోటీలు సాగాయి. మొత్తం నూరు మందికి పైగా పారా క్రీడాకారులు పాల్గొన్నారు.
రూరల్మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్‌లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు.
ప్రజాసమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల తో ఎమ్మెల్యే పరిటాలసునీత సోమవా రం బిజీబిజీగా గడిపారు. భక్త కనకదాస జయంతి వేడుకలను వెంకటాపురం గ్రామంలో కరుబలు నిర్వహించగా, ఆమె జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్నారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.
రుద్రంపేట ప్రధాన రహదారిపై ప్రయాణమంటే ప్రజలు హడలిపోయేవారు. రోడ్డు చాలా అధ్వా నంగా ఉండేది. గుంతలతో పాటు రోడ్డు పై రేగే దుమ్ము..ధూళితో స్థానికులు, వా హనదారుల అవస్థలు వర్ణనాతీతం.
టీడీపీ సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలపాలని టీడీపీ నాయకులు, కార్య కర్తలకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు నిచ్చారు. మండలంలోని ముత్యాలం పల్లిలో ఆదివారం ఆమె సభ్యత్వనమోదు గురించి గ్రామస్థులకు తెలియజేశారు.
అనంతపూర్ క్లబ్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూ, దాని అభివృద్ధికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ.20లక్షల నిధులు చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమని సెక్రట రీ కేశవ రెడ్డి తెలిపారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని అనంతపూర్ క్లబ్లో ఆదివారం సీనియర్ సభ్యుడు, బార్ అసోసియేషన కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
కార్తీకమాస అమావాస్యను పుర స్కరించుకుని మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రాముస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి, అలంకరించారు.
నగరంలో అడ్డదిడ్డమైన కట్టడాలు అధిక మవుతున్నా యి. దీంతో కనీసం మురుగు తీయడానికి కాలువలు కూడా అందుబాటులో ఉండటం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది ఒక ఎత్తయితే అక్రమ కట్టడాల వల్ల నగరపాలిక ఆదా యానికి భారీగా గండిపడుతోంది. ప్రతి ఏటా ఆ నష్టం రూ.5కోట్ల పైమాటే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ విహారయాత్రకు హాంకాంగ్ వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన బళ్లారికి వెళ్లేందుకు బయలుదేరారు.