Share News

MLA : పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీబిజీ

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:40 AM

ప్రజాసమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల తో ఎమ్మెల్యే పరిటాలసునీత సోమవా రం బిజీబిజీగా గడిపారు. భక్త కనకదాస జయంతి వేడుకలను వెంకటాపురం గ్రామంలో కరుబలు నిర్వహించగా, ఆమె జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్నారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.

MLA : పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీబిజీ
MLA Paritala Sunitha participated in the Kalasha procession in Venkatapuram

రామగిరి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల తో ఎమ్మెల్యే పరిటాలసునీత సోమవా రం బిజీబిజీగా గడిపారు. భక్త కనకదాస జయంతి వేడుకలను వెంకటాపురం గ్రామంలో కరుబలు నిర్వహించగా, ఆమె జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్నారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. గ్రామంలోని కురుబల 36 కుటుంబాల కు కంబళ్లు పంపిణీ చేశారు. గ్రామంలోని యల్లమ్మ దేవతను దర్శించుకుని పూజలుచేశారు.

అసత్యప్రచారాలు చేస్తే చర్యలు: పోస్టాపీసులో ఖాతా ఉంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే పరిటాలసునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, పోస్టాపీసు ఖాతాలకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

సభ్యత్వ నమోదులో వేగం పెంచాలి: టీడీపీ సభ్యత్వ నమోదులో మరింత వేగం పెంచాలని పరి టాలసునీత నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆమె సోమవారం కొత్తగాది కుంట గ్రామంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కొత్తదాగికుంటలో రూ.56లక్షలతో నిర్మిప్తున్న సీసీరోడ్ల పనులను ఆమె పరిశీలించా రు. ఆమె వెంట టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

గ్రామాల్లో సమస్యలపై ఆరా

రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రా మాల సమస్యలపై ఎమ్యెల్యే పరిటాల సునీత ఆరాతీశారు. వెంటాపు రానికి సోమవారం వచ్చిన వారందరితో సమావేశమై గ్రామాల్లో మౌలిక వసతుల గురించి అడిగి తె లుసుకున్నారు. గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్ల పనులు పూర్తి అయ్యాయా అని విచారించారు. అదేవిధంగా నసన కోట ఎంబీజీ పాఠశాల ప్రిన్సిపాల్‌ హమీనాబేగం, రామగిరిలోని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రామేశ్వరి వేర్వేరుగా ఎమ్మెల్యేని కలిసి ఈనెల 7వ తేదీన జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావాలని కోరారు. అదే విధంగా మండలంలో ని పేరూరులో కనకదాస విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని గ్రామానికి చెందిన కురుబ కులస్థులు ఎమ్మెల్యే పరిటాలసునీతకు విజ్ఞప్తిచేశారు. దీనిపై ఎ మ్మెల్యే సానుకూలంగా స్పందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 03 , 2024 | 12:40 AM