MLA : సభ్యత్వ నమోదులో ముందుందాం
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:24 AM
టీడీపీ సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలపాలని టీడీపీ నాయకులు, కార్య కర్తలకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు నిచ్చారు. మండలంలోని ముత్యాలం పల్లిలో ఆదివారం ఆమె సభ్యత్వనమోదు గురించి గ్రామస్థులకు తెలియజేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
రామగిరి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలపాలని టీడీపీ నాయకులు, కార్య కర్తలకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు నిచ్చారు. మండలంలోని ముత్యాలం పల్లిలో ఆదివారం ఆమె సభ్యత్వనమోదు గురించి గ్రామస్థులకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ....నియోజకవర్గంలో ఇప్పటివరకు 51వేలకు పైగా టీడీపీ సభ్యత్వం నమోదు చేయించారని, ప్రస్తుతం 15వ స్థానంలో ఉందన్నారు. సీకేపల్లి, రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు మండలాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. రాప్తాడు మండలం మొదటి స్థానంలో ఉందన్నారు. .65వేలకు పైగా సభ్యత్వ న మోదు చేయించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అలాగే రామగిరి మండలంలో టీడీపీ సభ్యత్వనమోదు విస్తృతంగా సాగుతోంది. ఆయా గ్రామాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలో ఇప్పటివరకు దాదాపు ఏడు వేల వరకు చే యించినట్లు తెలిపారు. పేరూరులో గ్రామకమిటి అధ్యక్షుడు వడ్డిసు బ్బు తన సొం త నిధులతో వంద సభ్యత్వాలు చేయించారు. నాయకులు షేక్‌దాదా పీరా, చాంద్ బాషా, శ్రీనివాసులు, గంగాధర, దండోరా శ్రీరాములు, కుంటిమాదన్న పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....