Home » Andhrajyothi
అని ఎప్పుడో, ఎక్కడో చదివినట్లు గుర్తు! ఉన్న విస్తీర్ణం చాలదంటూ పొరుగునున్న దేశాల్లో కాలూ వేలూ పెట్టడం చైనా నైజం. అంతటి చైనా ఎలా ఉంటుంది? చరిత్రలో చదివిన ‘గ్రేట్ వాల్’పై కాలు పెట్టి, కళ్లతో చూస్తే వచ్చే అనుభూతి... సోషల్ మీడియాలో కవ్వించే చాంచింగ్ సిటీ మెరుపు కలల మర్మమేమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే చైనా వెళ్లాల్సిందే!
‘‘జొన్నకలి జొన్నయంబలి/ జొన్నన్నము జొన్నపినరు జొన్నలు తప్పన్ సన్నన్నము సున్నగదా/ పన్నుగ పల్నాట నున్న ప్రజలందఱకున్’’ అనేక రోగాలపైన ఔషధం కావటాన జొన్న సామాన్యుడి జొన్నాయుధంగా మారిందిప్పుడు. ఒకనాడు కూటికి లేనివాళ్లు తినేది! ఇప్పుడు బియ్యమే చవక. ‘ఓడలు-బండ్లు’ అంటే ఇదే! తిట్టుకుంటూనే శ్రీనాథుడు కొన్ని జొన్నవంటకాల్ని ఈ చాటువులో పేర్కొన్నాడు.
భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్ ఒడిస్సీ’.
ఇప్పటిదాకా అనేక గుళ్లు చూసి ఉంటారు కానీ, ఓ మోటార్‌సైకిల్‌కి గుడికట్టి పూజించడం ఎక్కడైనా చూశారా? ఈ చిత్రమైన ఆలయం రాజస్థాన్‌లోని జోథ్పూర్నకు 50 కి.మీ దూరంలో ఉంది.
మాటల్లో చమత్కారాలూ, విరుపులూ, మెరుపులూ, ప్రాసలూ అలవోకగా జాలువారే వెంకయ్య నాయుడి వాగ్ధాటి అందరికీ తెలుసు. తెలిసిన సంగతులు పక్కనబెట్టి ఆయన జీవిత కథను చిత్రాల్లో చెప్పటంలో విజయం సాధించిన అందమైన పుస్తకం ‘మహానేత’. భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి జీవితాన్ని దృశ్య కావ్యంగా మలిచారు సంజయ్ కిషోర్.
నవంబర్ 5, 2024 మంగళవారం... మరి రెండు రోజులు... ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు... అమెరికా చరిత్రలో నూతన అధ్యాయానికి అమెరికన్ ఓటర్లు ఆరోజున శ్రీకారం చుట్టబోతున్నారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టాల’నే నినాదంతో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ‘అమెరికాను సమైక్యంగా నిలబెట్టాల’నే నినాదంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గత కొన్ని నెలలుగా తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఇంతకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆ ‘మెరిక’ ఎవరు?
ఎప్పుడూ ఒకే రకం పంటలు కాకుండా, సరికొత్త పంటలతో సాగులో వైవిధ్యం చూపుతున్నారు కొందరు రైతులు. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే కొన్ని అరుదైన పంటలను అభివృద్ధి చేసే దిశగా ఈ రైతులు అడుగులు వేస్తున్నారు. సాగుబడిలో కొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఆ విశేషాలే ఇవి...
రతన్‌టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్ యానిమల్ హాస్పిటల్’ ప్రారంభించారు..
సినిమా, క్రికెట్లది విడదీయరాని బంధం. ఇద్దరూ స్టార్లే... అయితే తమ అభినయంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టే అందాలభామలు క్రికెట్ స్టార్లకు వీరాభిమానులు. అందుకే క్రికెట్ స్టేడియంలో అప్పుడప్పుడు మెరుస్తుంటారు. ఇంతకీ ఎవరి ఫేవరెట్ స్టార్ ఎవరు? వారి మాటల్లోనే...
మనీలాండరింగ్ కేసుల పేరుతో ఓ వైద్యురాలిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఆమె నుంచి రూ.3 కోట్ల మేర కాజేశారు. నగరంలో నివసించే వైద్యురాలు (54)కు ఈనెల 14న ఓ వ్యక్తి ట్రాయ్ అధికారినని ఫోన్ చేశాడు. మీ మొబైల్ నంబర్‌తో పెద్దమొత్తం లో హవాలా డబ్బు తరలించారని ఆరోపించడమే కాకుండా రెండు గంటల్లో మీ సిమ్ బ్లాక్ చేస్తామని చెప్పాడు.