Share News

Anti-corruption Department : రుచికరమైన సీటు

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:01 AM

ఆ అధికారి పనిచేసేది అవినీతి నిరోధక శాఖలో..! కానీ కంచె చేను మేసినట్లు ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీలో ఏ అధికారైనా మూడేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ఆయన ఐదేళ్లుగా అదే సీటులో కొనసాగుతున్నారు. గతంలోనూ నాలుగేళ్లపాటు పనిచేశారు. ఏసీబీ డీఎస్పీ బదిలీ అయిన సందర్భంలో దాదాపు రెండేళ్లపాటు ఇనచార్జి డీఎస్పీగా ఉన్నారు. సీనియర్‌ సీఐని అంటూ వ్యవహారం నడిపారు. ఇప్పటికి అక్కడ పనిచేయబట్టి ఐదేళ్లయినా బదిలీ కాకుండా చక్రం తిప్పుతున్నారు. తాజాగా డీఎస్పీ బదిలీ కావడంతో మరోసారి ఇనచార్జి కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. సంపాదన బాగా మరిగినందుకే ఆయన ‘అవినీతి’ నిరోధక శాఖను వీడటం లేదన్న ...

Anti-corruption Department : రుచికరమైన సీటు

ఐదేళ్లుగా వదలని అధికారి

ఏసీబీలో ఉంటూ.. అక్రమ సంపాదన

వసూళ్ల విధులకు ప్రత్యేక కానిస్టేబుల్‌

గురుశిష్యుల అక్రమ ఆస్తులు రూ.కోట్లలోనే..

ఇనచార్జి డీఎస్పీ సీటు కోసం విశ్వప్రయత్నాలు

ఆ అధికారి పనిచేసేది అవినీతి నిరోధక శాఖలో..! కానీ కంచె చేను మేసినట్లు ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీలో ఏ అధికారైనా మూడేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ఆయన ఐదేళ్లుగా అదే సీటులో కొనసాగుతున్నారు. గతంలోనూ నాలుగేళ్లపాటు పనిచేశారు. ఏసీబీ డీఎస్పీ బదిలీ అయిన సందర్భంలో దాదాపు రెండేళ్లపాటు ఇనచార్జి డీఎస్పీగా ఉన్నారు. సీనియర్‌ సీఐని అంటూ వ్యవహారం నడిపారు. ఇప్పటికి అక్కడ పనిచేయబట్టి ఐదేళ్లయినా బదిలీ కాకుండా చక్రం తిప్పుతున్నారు. తాజాగా డీఎస్పీ బదిలీ కావడంతో మరోసారి ఇనచార్జి కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. సంపాదన బాగా మరిగినందుకే ఆయన ‘అవినీతి’ నిరోధక శాఖను వీడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అవినీతి అధికారులపై బాధితులు ఫిర్యాదు చేస్తే.. ఈ సారు నేరుగా ఆ అధికారి లైనలోకి వెళతారట. రూ.లక్షల్లో బేరమాడుతారట. ఏసీబీలో మొత్తం 13 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిలో ఓ కానిస్టేబుల్‌ను


తనకు నమ్మినబంటుగా మార్చుకున్నారు. వసూళ్ల వ్యవహారమంతా ఆ కానిస్టేబుల్‌ చూసుకుంటారని సమాచారం. సార్‌ను నమ్ముకున్నందుకు ఆ కానిస్టేబుల్‌ అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడని ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో ఏసీబీ కార్యాలయంలో ఆ అధికారిదే రాజ్యమని ఆ శాఖ సిబ్బందే అంటున్నారు. - అనంతపురం క్రైం

ఒక్కరినైనా పట్టుకున్నారా..?

ఆ అధికారి హయాంలో ఒక్క అవినీతి అధికారినీ పట్టుకున్నింది లేదు. స్వతహాగా దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలపై దాడులు నిర్వహించిన సమయంలో.. జిల్లాలోనూ కొందరిని పట్టేశారు. అంతే..! ఉమ్మడి జిల్లాకు ఒకటే ఏసీబీ కార్యాలయం ఉండటం, అందులో ఆయనే సీనియర్‌ కావడంతో అడ్డు లేకుండా పోతోంది. భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కదిరి ప్రాంతానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగికి రూ.5 లక్షలకు అమ్ముడుపోయారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆ ఉద్యోగిని అరెస్టు చేయకుండా ఏసీబీ అధికారులు తప్పించడమే దీరికి కారణమని కొందరు అంటున్నారు. ఓ ట్రాన్సకో ఏఈపై లంచం అడుగుతున్నారని బాధితులు ఫిర్యాదు చేస్తే.. ఆ ఏఈతో బేరం మాట్లాడుకుని, రూ.5 లక్షలు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. బుక్కపట్నం సబ్‌ రిజిసా్ట్రర్‌పై గతంలో ఏసీబీ కేసు నమోదైంది. ఆ కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికి.. రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చివరికి ఆయన అదృశ్యమై చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు.

భూములపై పెట్టుబడి..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి.. వసూళ్లకు తనకు నమ్మకస్తుడైన కానిస్టేబుల్‌ను పంపుతుంటారని సమాచారం. అలా అక్రమంగా సంపాదించిన సొమ్మును భూములపై పెట్టుబడి పెడుతుంటారని, ఆస్తులను పోగేసుకుంటున్నారని ప్ర చారం జరుగుతోంది. ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా వెచ్చించి రెండు అపార్ట్‌మెంట్లు, 20 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, కడప నగరంలో రెండు ప్రాంతాల్లో విలువైన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని సమాచారం. తనపై అవినీతి ఆరోపణలు వస్తే.. ఉన్నతాధికారులను మేనేజ్‌ చేస్తారట. కేసులు ఎందుకు లేవని ఉన్నతాధికారులు అడిగితే... ‘ఆఫీస్‌ నగరానికి దూరంగా ఉంది. అందుకే ఫిర్యాదు చేయడానికి ఎవరూ రావడం లేదు’ అని చెబుతారట. గతంలో పనిచేసిన ఆ శాఖ ఉన్నతాధికారి, ప్రస్తుతం ఉన్న ఓ ఉన్నతాధికారి కాళ్లకు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారట. ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని ఇటీవల బదిలీ చేశారు. తిరుపతి డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో ఇప్పుడు కూడా ఇనచార్జి (డీఎస్పీ) సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఇనచార్జ్‌ అధికారితో సైతం ‘మీరు రానవసరం లేదు లెండి మేడమ్‌.. నేనే చూసుకుంటా’ అని చెబుతున్నారట.

ఆఫీ్‌సలో వడ్డీ వ్యాపారం

ఆ సీఐ అండతో అక్రమ సంపాదన రుచిమరిగిన కానిస్టేబుల్‌.. ఏసీబీ కార్యాలయమే వేదికగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని సమాచారం. ‘మా సార్‌ అండ ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు..’ అని ధీమాగా చెబుతారట. ఆఫీ్‌సలో కూర్చుని.. ఎవరెవరు ఎంత వడ్డీ ఇవ్వాలో లెక్కలేసుకుంటూ ఉంటారని సమాచారం. వడ్డీలు కట్టనివారికి ఆఫీస్‌ నుంచి ఫోన చేసి బెదిరిస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లతో ఎప్పుడో కోటీశ్వరుడైన ఆ కానిస్టేబుల్‌.. విధులను గాలికి వదిలేశారని అంటున్నారు. ఇప్పటికే అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో రూ.కోటి విలువైన ఇంటిని కట్టించాడట. తాజాగా రూ.80 లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 25 , 2024 | 12:01 AM