Home » AP Assembly Elections 2024
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. అశోకా రోడ్డులోని ఏపీ భవన్‌కి చేరుకున్నారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ముందు హాజరయ్యేందుకు ఇరువురు అధికారులూ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
డీబీటీ పథకాలకు నిధుల విడుదల తక్షణం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. సంక్షేమ పథకాల కోసం కేటాయించిన సొమ్మును కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లేఖపై గవర్నర్ వెంటనే స్పందించారు. చంద్రబాబు ఫిర్యాదుతో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు.
ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్‌కి ఓటేశారట.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.
న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.
ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.