Share News

AP News: ఢిల్లీకి చేరుకున్న సీఎస్, డీజీపీలు.. ఈసీకి ఏం వివరణ ఇస్తారో..

ABN , Publish Date - May 16 , 2024 | 12:33 PM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. అశోకా రోడ్డులోని ఏపీ భవన్‌కి చేరుకున్నారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ముందు హాజరయ్యేందుకు ఇరువురు అధికారులూ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP News: ఢిల్లీకి చేరుకున్న సీఎస్, డీజీపీలు.. ఈసీకి ఏం వివరణ ఇస్తారో..

ఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. అశోకా రోడ్డులోని ఏపీ భవన్‌కి చేరుకున్నారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ముందు హాజరయ్యేందుకు ఇరువురు అధికారులూ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నిన్న ఈసీ సమన్లు జారీ చేసింది. ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఇచ్చిన సమన్ల కు సమాధానం చెప్పేందుకు ఇద్దరు అధికారులూ ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ ఎదుట ఇరువురు అధికారులూ హాజరుకానున్నారు.

AP Elections: చంద్రగిరి ఎన్నికల అధికారిని మార్చాల్సిందే: పులివర్తి నాని


పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు పోలింగ్‌ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరుతూ ఈసీ సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించింది. నిజానికి ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎస్, డీజీపీలు పూర్తిగా విఫలమయ్యారు. నేడు ఈసీ ఎదుట వీరిద్దరూ ఏం వివరణ ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి...

Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Rohit Sharma: ముంబై టీమ్‌లో రెండు వర్గాలు.. భారత ఆటగాళ్లు రోహిత్ వైపు.. ఫారిన్ ప్లేయర్లు హార్దిక్ వైపు..?

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 12:33 PM