AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!
ABN , Publish Date - May 16 , 2024 | 04:19 PM
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
అనంతపురం, మే 16: తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తన భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వారికి సహాయకులను వెంటనే తమ ఇంట్లోకి అనుమతించాలని పోలీసులకు జేసీ దివాకర్ రెడ్డి విజ్జప్తి చేశారు. జేసీ దివాకర్ రెడ్డి చేసిన విజ్జప్తిని పోలీసులు తొసిపుచ్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి వివరించారు. దీంతో ఆయన హుటాహుటిన బయలుదేరి తాడిపత్రి చేరుకున్నారు.
LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!
తాడిపత్రి విడిచి వెళ్లాలని జేసీ పవన్ రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని పవన్ పోలీసులకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లు విడిచి వెళ్లమంటారా? అని పోలీసుల తీరుపై జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్
పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నోటీసులు కూడా జారీ చేశారు. జేసీ నివాసంలోకి ఎవరు వెళ్లకుండా అన్నీ దారులను మూసి వేశారు. పోలీసుల వ్యవహార శైలిపై జేసీ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ అయిన తర్వాత ఇలా వ్యవహరించడంపై మండిపడుతున్నారు.
National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ
మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా పల్నాడు, తాడిపత్రిలో ఘర్షణలు చెలరేగాయి. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌తోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పల్నాడు, తాడిపత్రి పాంత్రాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది.
Read Latest AP News AND Telugu News
Read Latest National News And Telugu News