Share News

AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం జగన్ సెక్యూరిటీ సిబ్బంది పార్టీ.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ABN , Publish Date - May 15 , 2024 | 07:49 PM

న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.

 AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం జగన్ సెక్యూరిటీ సిబ్బంది పార్టీ.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
Nara Chandrababu Naidu

అమరావతి: ఎన్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఉల్లంఘించారని అన్నారు.


ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ‘‘సిద్ధం’’ పోస్టర్‌తో, అధికార వైసీపీ డీజే పాటలతో పార్టీ నిర్వహించారని చెప్పారు. ఈ పార్టీలో 450 మందికిపైగా పోలీసు అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అత్తాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరియు స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఈఓ ఎంకే మీనాను చంద్రబాబు కోరారు.

ఇవి కూడా చదవండి

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 08:18 PM