Home » AP Election Counting
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి..
పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది...
2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) చివరి ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. ఈ క్రమంలో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(mukesh kumar meena) లేఖ రాస్తూ అధికారులు, ప్రజలకు కీలక ఆదేశాలను వెలువరించారు.
పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...