AP Election Polling 2024:ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నాం: చంద్రబాబు
ABN , Publish Date - May 13 , 2024 | 08:23 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు. ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నామని ఉద్ఘాటించారు. ప్రజా స్ఫూర్తితో వైసీపీ కుట్రలు ఎక్కడికక్కడ భగ్నం చేశామన్నారు. ఓటమి భయంతో అధికార వైసీపీ నేతలు ఎన్నికల వేళా కుట్రలు పన్నుతూ వచ్చారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఓటర్‌లోనూ కనిపించిందని వివరించారు. ఓటమి భయంతో హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.పుంగునూరులో ఏజెంట్ల కిడ్నప్‌తో మొదలు పెట్టి, మాచర్ల, తాడిపత్రి, నరసారావుపేట, గురజాల పెనమలూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని .. కానీ తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ ధీటుగా ఎదుర్కోవటంతో వారి ఆటలు సాగలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరారు.సీఎం సీఎం అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలింగ్ సరళి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అందరితో ఆనందం పంచుకుంటూ ఇంటికి చంద్రబాబు బయలుదేరారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
AP Elections: ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు..?