Home » Army
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది.
మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.
భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో మరో విజయం సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా, డొబనార్ మషల్ ప్రాంతంలో వీరిని మట్టుబెట్టినట్లు కశ్మీరు పోలీసులు ప్రకటించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్
మణిపూర్ లో ఇటీవల తలెత్తిన భారీ హింసాకాండ ఇప్పడిప్పుడే తగ్గుపడుతున్న సమయంలో సోమవారంనాడు మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇంఫాల్లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఆ దేశ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు చెల్లదని
భారత సైన్యంలో బ్రిగేడియర్, ఆ పై స్థాయి అధికారులకు ఒకే తరహా యూనిఫాం ఉండబోతోంది. ఆగస్టు ఒకటి నుంచి
గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో మణిపూర్ (Manipur) జనజీవనం అతలాకుతలమైంది. భారత సైన్యం
జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.