Indian Army : సైన్యంలో యూనిఫాం సంస్కరణలు

ABN , First Publish Date - 2023-05-09T14:55:37+05:30 IST

భారత సైన్యంలో బ్రిగేడియర్, ఆ పై స్థాయి అధికారులకు ఒకే తరహా యూనిఫాం ఉండబోతోంది. ఆగస్టు ఒకటి నుంచి

Indian Army : సైన్యంలో యూనిఫాం సంస్కరణలు
Indian Army

న్యూఢిల్లీ : భారత సైన్యంలో బ్రిగేడియర్, ఆ పై స్థాయి అధికారులకు ఒకే తరహా యూనిఫాం ఉండబోతోంది. ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోందని సైన్యం (Indian Army)లోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పేరెంట్ కేడర్, అపాయింట్‌మెంట్ వంటివాటితో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆ పై స్థాయి అధికారులకు ఒకే విధమైన యూనిఫాం ఉంటుందని తెలిపాయి. ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో దీనిపై సవివరమైన చర్చ, విస్తృత సంప్రదింపులు జరిగాయని వివరించాయి.

సంబంధితులందరితోనూ విస్తృతంగా ఈ సమావేశంలో చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ మార్పులు ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తాయని వివరించాయి. సీనియర్ ఆఫీసర్ల హెడ్‌గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జెస్, జార్జెట్ ప్యాచెస్, బెల్ట్, షూస్‌లను స్టాండర్డయిజ్డ్ చేయనున్నట్లు తెలిపాయి. కల్నల్స్, వారి కన్నా క్రింది స్థాయి సిబ్బంది యూనిఫాంలో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పాయి.

సీనియర్ లీడర్‌షిప్‌ మధ్య సర్వీస్ విషయాల్లో రెజిమెంటేషన్ పరిధులకు అతీతంగా కామన్ ఐడెంటిటీని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల భారత సైన్యం సమభావంగల లక్షణాలు కలదనే భావం మరింత బలపడుతుందని తెలిపాయి.

బ్రిగేడియర్లు, ఆ పై స్థాయి అధికారులు హెడ్‌క్వార్టర్లలోని యూనిట్లు, బెటాలియన్లు వంటివాటికి నాయకత్వం వహిస్తారు. అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా పని చేస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి :

Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..

Ramdas: మరీ ఇంత దారుణమా.. ఓ విద్యార్థిని లోదుస్తుల్ని తొలగించి..

Updated Date - 2023-05-09T14:55:51+05:30 IST