Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

ABN , First Publish Date - 2023-06-16T11:58:14+05:30 IST

మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.

Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్ : మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.

కశ్మీరు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు అక్రమంగా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా కౌంటర్ ఇన్‌ఫిల్ట్రేషన్ ఆపరేషన్‌ను గురువారం రాత్రి ప్రారంభించినట్లు తెలిపారు. ఉత్తర కశ్మీరులోని కుప్వారా జిల్లా, నియంత్రణ రేఖ వెంబడి జుమగుండ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ఈ ఎన్‌కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటీవల అనేక చొరబాటు యత్నాలను భగ్నం చేసినట్లు తెలిపారు.

పూంఛ్ సెక్టర్లో గురువారం అక్రమ చొరబాటు యత్నాలను సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి నుంచి 10 భారీ చొరబాటు యత్నాలను భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. దీనినిబట్టి పాకిస్థాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తోందో అర్థమవుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..

Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..

Updated Date - 2023-06-16T11:58:14+05:30 IST