Home » Asifabad
ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి.. ఆ నీళ్లను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలిస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. దానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి, గోవిందాపూర్ గ్రామాల సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా.. 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.