Home » Bangladesh
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.
రిజర్వేషన్ల కోటా ఆంశం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పీఠాన్నే కుదిపేసింది. ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంపై రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు విరుచుకుపడటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, వెంటనే సైనిక విమానంలో దేశం విడిచి అజ్ఞాత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
పొరుగునున్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం తొలి రోజు, ఆదివారం దేశ వ్యాప్తంగా రక్తపాతానికి దారి తీసింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఆదివారం మరో మలుపు తిరిగింది. పోలీసుల దాడుల్లో ఒక్క రోజులో 72 మంది నిరసనకారులు చనిపోయారు.
రిజర్వేషన్ల రగడ బంగ్లాదేశ్‌ని(Bangladesh clashes) భూభాగాన్ని రక్తసిక్తం చేస్తోంది. ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి.
రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడంతో పాటూ ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. అయినా చాలా మందిలో ..
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఒక దేశం నుంచి మరో దేశానికి ఎవరైనా వెళ్లాలంటే.. వీసా, పాస్ పోర్ట్, గుర్తింపు కార్డు, అధికారిక పత్రాలు ఉండాలి. అయితే ఇవేమి లేకుండా ఎవరు.. మరో దేశానికి వెళ్లడానికి వీలు ఉండదు. వీలు పడదు. అయితే ఇవేమీ లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా ప్రవేశించ వచ్చునో ఓ యూట్యుబర్ వివరించాడు.