Home » Bangladesh
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్)లోనే ఉండిపోయారు.
బంగ్లాదేశ్(bangladesh)లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024) ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా నిరాకరించారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు యూనస్ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. బంగ్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు.
షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్పై బంగ్లాదేశ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 4వ తేదీ.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా టీచర్ హుస్సేన్ ఆ ఆందోళనలో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
బంగ్లాదేశ్(Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 15న జాతీయ సెలవుదినాన్ని(public holiday) రద్దు చేశారు. ఈ రోజున బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు.
బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు చోటుచేసుకున్నాయి.
బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు.