Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 09:41 PM
ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: హిందువులు, మైనారిటీ వర్గాలపై బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో దాడులు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయి. ఆ ప్రకారం పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లో 20 రెట్లు అధికంగా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ లోక్‌సభలో శుక్రవారంనాడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల గణాంకాలను ప్రస్తావిస్తూ మంత్రి ఈ వివరణ ఇచ్చారు. హింసాత్మక ఘటనలపై భారత ప్రభుత్వం తమ ఆందోళనను బంగ్లా ప్రభుత్వానికి తెలియచేసిందని, అవసరమైన చర్యలు బంగ్లాదేశ్ తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.
Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన
పాకిస్థాన్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ వరకూ 112 కేసులు నమోదయ్యాయని కీర్తి వర్దన్ సింగ్ తెలిపారు. మంత్రి షేర్ చేసిన సమాచారం ప్రకారం, 2022లో బంగ్లాదేశ్‌లో 47 కేసులు, పాకిస్థాన్‌లో 241 కేసులు నమోదు కాగా, 2023లో ఆ సంఖ్య బంగ్లాదేశ్‌లో 303గా, పాకిస్థాన్‌లో103గా ఉంది. మతపరమైన హింస, మైనారిట వర్గాలపై దాడులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను కూడా కోరినట్టు మంత్రి చెప్పారు. ఈ రెండు దేశాలు మినహా మరే పొరుగు దేశంలోనూ హిందువులపై హింసాత్మక దాడులు నమోదు కాలేదని తెలిపారు. పాకిస్థాన్‌లో మైనారిటీల దుస్థితిని అంతర్జాతీయ వేదకలపై కూడా భారత్ ఎండగడుతోందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని ఢాకాలోని భారత కార్యాలయం ఎప్పడికప్పుడి తెలుసుకుంటోందని మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి:
Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం
Read More National News and Latest Telugu News