Share News

Bangladesh: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:57 PM

Chinmoy Krishna Das: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌ తీవ్ర అనారోగ్యయానికి గురయ్యారు. ఆయన కోలుకోనేందుకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని యాంగ్రీ సాఫ్రాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Bangladesh: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి
Hindu priest Chinmoy Krishna Das

ఢాకా, డిసెంబర్ 30: బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి తీవ్ర అనారోగ్యానికి గరయ్యారని యాంగ్రీ సాఫ్రాన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని..అందుకు నూతన సంవత్సరం ప్రారంభ వేళ.. జనవరి 1వ తేదీన దేశంలోని అన్ని దేవాలయాల్లో అంతా ప్రార్థనలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు నిచ్చింది. జైలులో ఆయనకు సౌకర్యాలు కల్పించలేదని విమర్శించింది. ఆ క్రమంలో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్నారని చెప్పింది.

అయితే ఇప్పటికే అనారోగ్యానికి గురైన ఆయన్ని రెండు సార్లు ఆసుపత్రికి తరలించారని స్పష్టం చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా యాంగ్రీ సాప్రాన్ సోమవారం వెల్లడించింది. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను నవంబర్ 25వ తేదీన హజరత్ షాజ్‌లాల్ ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ చతోర్గమ్ కోర్టు.. కృష్ణదాస్‌ను జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన పెట్టుకొన్న దరఖాస్తును సైతం కోర్టు తోసి పుచ్చింది. అయితే ఈ కేసులో వాదనలు 2025, జనవరి 2వ తేదీన వింటామని కోర్టు స్పష్టం చేసిన విషయం విధితమే.


మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్‌లోని మైనార్టీ సంస్థలు తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అలాగే కృష్ణదాస్‌పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఇక బంగ్లాదేశ్‌లోని మైనార్టీలను రక్షించాలని.. అలాగే కృష్ణదాస్ విడుదలలో జోక్యం చేసుకోవాలంటూ మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌కు బంగ్లాదేశ్ అమెరికన్ హిందువులు, బౌద్దులు, క్రైస్తవులతోపాటు మైనార్టీ వర్గాలు ఒక తాటిపైకి వచ్చి విజ్జప్తి చేశాయి.

Also Read :సైంధవ లవణంతో ఇన్ని లాభాలున్నాయా..?

Also Read :పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్

Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక


బంగ్లాదేశ్‌లో మతపరంగా.. జాతిపరంగా మైనార్టీలపై దురగతాలు చోటు చేసుకొంటున్నాయని ఆరోపించాయి. ఇవి ఇస్లామిక్ శక్తుల నుంచి వస్తున్న అస్తిత్వ ముప్పుగా బంగ్లాదేశ్‌ ఇండియన్ గ్రూప్ ఈ సందర్భంగా అభివర్ణించింది. చిన్మయ్ కృష్ణదాస్‌పై దేశ ద్రోహం నేరం మోపి అన్యాయంగా జైల్లో పెట్టిందంటూ.. ఆయన విడుదలకు తక్షణమే జోక్యం చేసుకోవాలని ట్రంప్‌కు సదరు సంస్థలు సూచించాయి. ఈ మేరకు ట్రంప్‌కు వినతి పత్రాన్ని సమర్పించాయి.

Also Read: కొత్త ఏడాదిలో వారిద్దరికి సినిమా చూపిస్తాం

Also Read: రేవంత్ ఈగో చల్లబడింది..


ఇక ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమంలో భాగంగా జాతి, మతపరమైన హింసను నిలిపి వేయడంలో బంగ్లాదేశ్‌ను భాగస్వామ్యం చేయాలని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. అలాగే మైనార్టీలతోపాటు స్థానిక సమూహాలను గుర్తించడానికి సమగ్ర మైనార్టీ రక్షణ చట్టాన్ని అధికారికంగా తీసుకు రావాలని అవి స్పష్టం చేశాయి.

For International News And Telugu news

Updated Date - Dec 30 , 2024 | 07:58 PM