Home » Bhumana Karunakar Reddy
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి,ఈవో ధర్మారెడ్డి ఆలయం వద్ద ఆవిష్కరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటైంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ అధికారికంగా జాబితాను విడుదల చేసింది..
టీటీడీ ప్రకటించిన మనిషికో కర్ర ఒక జోక్‌గా మారిపోయి వైరల్ అయ్యింది. ఒక వేళ సీరియస్‌గా తీసుకున్నా ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీన్ని అమలు చేయాలంటే వేల సంఖ్యలో కర్రలు సేకరించాలి. వాటికోసం అడవి మీద పడాలి. అలిపిరిలో భక్తులకు ఇచ్చే కర్రలను మళ్ళీ తిరుమల దివ్యారామం వద్ద కలెక్ట్ చేసుకోవాలి. వాటిని వాహనాల్లో మళ్ళీ అలిపిరికి తరలించాలి. మధ్యలో భక్తులు కర్రలు పారవేయడం, విరిచేయడం చేస్తే పైకి వెళ్ళేసరికి కర్రల సంఖ్య తగ్గుతుంది.
పెద్ద పదవుల్లో ఉన్న వారు ‘భవిష్యత్ అవసరాలకు’ పనికొస్తారనుకుంటే చాలు... రకరకాల మార్గాల్లో వారి ‘చల్లని చూపుల’ కోసం ప్రయత్నిస్తుంటారు.
టీటీడీ 53వ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన చేత ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు నిర్వహించారు.
భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) కీలక పదవి కట్టబెట్టారు. భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు...